తెలంగాణ

telangana

ETV Bharat / state

శిల్పారామంలో సంక్రాంతి సంబురం.. భాగ్యనగరంలో కోలాహలం

హైదరాబాద్ మహానగరంలో పల్లె సంస్కృతి, తెలుగు సంప్రదాయాలను పంచుతున్న శిల్పారామం సందర్శకులతో సందడిగా మారింది. నగరంలో ఉండి తమ ఊరికి వెళ్లలేని వారు ఇక్కడ తమ ఊరును చూసుకుంటూ సంబురపడిపోతున్నారు. చిన్న, పెద్ద కుటుంబ సమేతంగా శిల్పారామంలో భోగి వేడుకల్లో ఆనందంగా పాల్గొన్నారు.

sankranthi
sankranthi

By

Published : Jan 13, 2021, 10:24 PM IST

Updated : Jan 13, 2021, 10:51 PM IST

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పారామంలో భోగి వేడుకలు కనుల పండువగా నిర్వహించారు. చిన్న పెద్ద అంతా కలిసి సంతోషంగా గడిపారు. సందర్శకుల కోసం నిర్వాహకులు అన్నీ ఏర్పాట్లు చేశారు. కచ్చితంగా మాస్కులు ధరించేలా శిల్పారామం అధికారులు చర్యలు తీసుకున్నారు.

అన్ని సౌకర్యాలు

ఏటా శిల్పారామానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని... దానిని దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కల్పించిన్నట్లు శిల్పారామం మేనేజర్‌ అంజయ్య తెలిపారు. సందర్శకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండ చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గతేడాది 8 వేల మంది సందర్శకులు వచ్చారని... కొవిడ్‌ కారణంగా ఈ ఏడాది 4 వేల మంది వచ్చారని ఆయన వివరించారు.

పల్లె అందాలతో పాటు

సంక్రాంతి అంటేనే గుర్తుకు వచ్చే గంగిరెద్దుల ఆటలు, హరిదాసులు, బుడబుక్కల, జంగమదేవరులు, పిట్టల దొరలు ఇలా శిల్పారామానికి వచ్చే సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి. సాయంత్రం వేళ హంపీ థియేటర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి.

ఒత్తిడి నుంచి ఉపసమనం

పల్లె అందాలను చూసేందుకు శిల్పారామానికి వచ్చినట్లు చిన్నారులు చెబుతున్నారు. కొవిడ్‌ కారణంగా ఆన్‌లైన్‌ తరగతులకు పరిమితమైన విద్యార్థులు ఇక్కడికి రావడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతంలో ఎలా ఉంటుందో ఇక్కడ అలాగే ఉందని అంటున్నారు. పల్లె అందాలతో పాటు మన సంప్రదాయాలను తెలియజేసేందుకు తమ పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

వారి కోసమే

పల్లె వాతావరణం ఉట్టిపడే విధంగా అందంగా అలంకరించినట్లు శిల్పారామం అధికారులు చెప్పారు. నగరంలో ఉండి సొంతూర్లకు వెళ్లలేని వారు శిల్పారామానికి వస్తే ఆ బాధను మర్చిపోతారని అధికారులు, సందర్శకులు చెబుతున్నారు.

శిల్పారామంలో సంక్రాంతి... సంబురాల్లో నగరవాసులు

ఇదీ చదవండి:టీకాకు సర్వం సన్నద్ధం... జిల్లాలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌

Last Updated : Jan 13, 2021, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details