పారిశుద్ధ్య కార్మికుల ఆవేదన
కరోనా లాక్డౌన్ లో ఎన్నో కష్టనష్టాలకోర్చి నగరాన్ని శుభ్రంగా ఉంచుతున్నామని, తమ వేతనాలలో కోతలు విధించడం సరికాదని పారిశుధ్య కార్మికులంటున్నారు. తమ కొచ్చేదే తక్కువ జీతమైనప్పుడు దానిలోనే కోతలు విధించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. వైద్యులు, పోలీసులకు ఇచ్చినట్లుగానే తమకు పూర్తి నెలజీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. విపత్కరపరిస్థితులలోనూ ఇంటి పట్టునుండక పనులు చేస్తున్నామని పేర్కొంటున్నారు.
వైద్యులకు, పోలీసులకు ఇస్తున్నట్లుగానే తమకు కూడా పూర్తి వేతనాలు ఇవ్వాలని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. లాక్ డౌన్ ఉన్నప్పటికి పూర్తిస్థాయిలో విధులు నిర్వహిస్తున్నామని, తమకు వచ్చేదే తక్కువ జీతమని అందులో కూడా కోత విధించడం సరికాదన్నారు. ఇళ్లల్లో పిల్లలు వద్దంటున్నా విధులకు హాజరవుతున్నామని పేర్కొంటున్నారు. ఇటూ రవాణా సదుపాయం కూడా లేదని వాపోతున్నారు. ఇలాంటి సందర్భంలో భయభ్రాంతులతో పనిచేస్తున్నామంటున్న జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో ఈటీవీ ముఖాముఖి.