Sailing Week at Hussainsagar in Hyderabad : ప్రతిష్ఠాత్మకమైన సెయిలింగ్ వీక్ హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో అంగరంగవైభవంగా జరిగింది. ఈనెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించిన 37వ సెయిలింగ్ వీక్‌లో.. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా పోటీలు నిర్వహించారు. ఇందులో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మందికి పైగా సెయిలర్లు పోటీపడ్డారు.
Sailing Week in Hyderabad :సెయిలింగ్‌కు జులై- ఆగస్టు నెలల్లో హైదరాబాద్‌లో వాతావరణం అత్యంత అనుకూలంగాఉంటుంది. సెయిలింగ్ వీక్ కోసం గత పదిహేను రోజుల నుంచి సెయిలర్లకు కావాల్సిన సదుపాయాలను సమకూర్చారు. ఇందులో భాగంగా సెయిలర్లకు శిక్షణను ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సెయిలింగ్ వీక్‌లో పాల్గొనేందుకు సెయిలర్లు వచ్చారు. వారికి ఇక్కడి వాతావరణం అలవాటుపడే విధంగా తర్ఫీదునిచ్చారు.
సుమారు వందమందికి పైగా సెయిలర్లు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. ఈనెల 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు హుస్సేన్ సాగర్ వేదికగా 37వ సెయిలింగ్ వీక్ జరిగింది. లేజర్ స్టాండర్డ్, లేజర్ రేడియల్, లేజర్ 4.7 మూడు విభాగాలుగా జరిగే పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 100 మందికి పైగా సెయిలర్లు పోటీపడ్డారు.
"ఇది లేజర్ క్లాస్ ఒలింపిక్స్ బోటు. సాధారణంగా ఒలింపిక్స్‌లో మగవారికి ఇల్కా 7 బోటు. మహిళలకు ఇల్కా 6 బోటు. చిన్నపిల్లలకు 4.7 బోట్లను ఉపయోగిస్తారు. ఇక్కడ వీటినే ఉపయోగిస్తాం. లేజర్ క్లాస్‌లో రెండు రకాల ఈవెంట్స్ జరుగుతాయి. అలాగే ఇందులో బాలురు, బాలికలు ఉపయోగించే బోటు ఎత్తుల్లో తేడాలు ఉంటాయి." - రాజేశ్ సెయిలర్, అర్జున అవార్డు గ్రహీత