హైదరాబాద్‌లో దీపావళి రెండో రోజన యాదవులు సదర్ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కొవిడ్ కారణంగా ఈ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నిరాడంబరంగా సదర్ వేడుకలు... దున్నరాజు సర్తాజ్ ప్రత్యేకం
దీపావళి సందర్భంగా ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలకు ముషీరాబాద్ ముస్తాబవుతోంది. కరోనా కారణంగా ఈసారి నిరాడంబరంగా జరుపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేడుక సాదాసీదాగా ఉన్నా దున్నరాజుల విషయంలో ఏమాత్రం తగ్గలేదు అంటున్నారు. ఈ వేడుకల్లో ప్రత్యేకమైన హర్యానా దున్నరాజు సర్తాజ్ ప్రత్యేకతలు, వేడుక విశేషాలను తెలుసుకుందాం!
నిరాడంబరంగా సదర్ వేడుకలు... దున్నరాజు సర్తాజ్ ప్రత్యేకం
సదర్ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ముషీరాబాద్ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్న హర్యానా దున్నారాజు సర్తాజ్ ప్రత్యేకతలపై అఖిల భారత యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి...
ఇదీ చదవండి:కొవిడ్ నిబంధనలతో దీపావళి జరుపుకోండి: శ్రీనివాస్ గౌడ్