తెలంగాణ

telangana

ETV Bharat / state

నగరంలో సందడిగా సదర్​ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా రూ.35 కోట్ల దున్నరాజు - Sadar Celebrations 2022 in Hyderabad

Sadar Celebrations in Hyderabad: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సదర్ వేడుకలు.. భాగ్యనగరంలో సందడిగా సాగుతున్నాయి. వేడుకల కోసం హర్యానా నుంచి దున్నరాజులను నిర్వాహకులు తెప్పించారు. దీపావళి అనంతరం.. యాదవ్ సోదరులు ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో రూ.35 కోట్ల గరుడ మేలు జాతి దున్నరాజు.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

నగరంలో సందడిగా సదర్​ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా రూ.35 కోట్ల దున్నరాజు
నగరంలో సందడిగా సదర్​ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా రూ.35 కోట్ల దున్నరాజు

By

Published : Oct 26, 2022, 6:41 AM IST

Updated : Oct 26, 2022, 7:18 AM IST

నగరంలో సందడిగా సదర్​ ఉత్సవాలు.. ప్రత్యేక ఆకర్షణగా రూ.35 కోట్ల దున్నరాజు

Sadar Celebrations in Hyderabad: సదర్ వేడుకలను ఈ సంవత్సరం వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్​లో యాదవులు భారీ ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్​కు చెందిన దూద్వాల నిర్వాహకుడు మధు యాదవ్ ఆధ్వర్యంలో.. పెద్ద గణేశ్​ విగ్రహం ముందు మున్సిపల్ మైదానంలో దున్న రాజుల ప్రదర్శన నిర్వహించారు. అత్యంత వైభవంగా నిర్వహించే వేడుకల్లో.. మేలు రకం జాతి దున్నరాజులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మధు యాదవ్ దున్నలను కొనుగోలు చేసి తన డైరీ ఫామ్​లో పోషిస్తున్నారు. హర్యానాకు చెందిన దున్న రాజులు సదర్ వేడుకల్లో విన్యాసాలు చేయనున్నాయి. వీటిలో గరుడ దున్న.. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

20 రోజుల క్రితం హైమాద్ అలాంఖాన్ యాజమాని వద్ద రూ.35 కోట్లతో కొనుగోలు చేసి.. హైదరాబాద్ తీసుకువచ్చిన్నట్లు మధు వివరించారు. దున్న వీర్యం నాణ్యతను బట్టి ధర నిర్ణయిస్తారన్న ఆయన.. గరుడ వీర్యం ఒక చుక్క 1,200 నుంచి 1,500 వరకు ఉంటుందని చెప్పారు. ముఖ్యంగా రాష్ట్రంలో ముర్రా జాతి వృద్ధికి ఉపయోగపడేందుకు కృషి చేస్తున్నట్లు మధు యాదవ్​ వెల్లడించారు. పాలు, పిస్తా, బాదం, కాజు.. ఆపిల్స్, కోడిగుడ్లు, మక్కలు, చున్ని, ఉలవలు, పల్లి, గజార్, బీట్​రూట్​ వంటి దాన పెడుతున్నామని ఆయన వివరించారు. కరోనా దృష్ట్యా గత రెండేళ్లుగా సదర్​ వేడుకలు సాదాసీదాగా జరగ్గా.. ఈసారి ఘనంగా యాదవులు నిర్వహిస్తున్నారు.

Last Updated : Oct 26, 2022, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details