తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ తర్వాతే కొత్త కాలేజీల ఏర్పాటు గురించి ఆలోచిస్తాం: మంత్రి సబితా - కాంగ్రెస్ సభ్యులు

విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని.. వీసీల నియామక ప్రక్రియను త్వరలోనే పూర్తిచేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

'ఉన్న కాలేజీలను సరిచేశాకే కొత్త కాలేజీల ఏర్పాటు'

By

Published : Sep 19, 2019, 5:21 PM IST

మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం

విద్యాశాఖ పద్దుపై అసెంబ్లీలో జరిగిన చర్చకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారు. విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. విమర్శలు సద్విమర్శలుగా భావిస్తూ మరింత సమర్థంగా పనిచేస్తామని చెప్పారు. విద్యను పటిష్ఠం చేసేందుకు అందరి సహకారం ఉండాలని మంత్రి కోరారు.కొత్త కళాశాలల ఏర్పాటు విషయమై స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న కాలేజీలకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి.. పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాకనే కొత్త కాలేజీల ఏర్పాటుపై ఆలోచిస్తామన్నారు. వీసీల నియామకానికి సంబంధించి సర్చ్ కమిటీలు వేసి వీలైనంత త్వరగా ప్రక్రియ పూర్తిచేస్తామని సబితా తెలిపారు. సభలో మంత్రి సబితా ప్రసంగాన్ని కాంగ్రెస్ సభ్యులు బహిష్కరించి బయటకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details