Run for Girl Child: బాలికల సాధికారత కోసం సేవా భారతి ఆధ్వర్యంలో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఆరో ఎడిషన్ హైదరబాద్ గచ్చిబౌలి స్టేడియం ఉత్సాహంగా సాగింది. కిశోరి వికాస్ కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. అందులో భాగంగా 21కె, 10కె, 5కె రన్నింగ్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ రన్‌ను సేవా భారతి నిర్వాహకులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ పోటీలు గచ్చిబౌలి స్టేడియం నుంచి ప్రారంభమై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ వరకు కొనసాగాయి.
Run for Girl Child: ఉత్సాహంగా సాగిన రన్ ఫర్ గర్ల్ చైల్డ్ కార్యక్రమం - హైదరాబాద్ తాజా వార్తలు
Run for Girl Child: బాలికల సాధికారత కోసం సేవా భారతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రన్ ఫర్ గర్ల్ చైల్డ్ ఆరో ఎడిషన్ ఉత్సాహంగా సాగింది. అందులో భాగంగా 21కె, 10కె, 5కె రన్నింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.
రన్ ఫర్ గర్ల్ చైల్డ్
సేవా భారతి తరపున 280 కిషోరి వికాస్ కేంద్రాలు పనిచేస్తున్నాయని నిర్వాహకులు తెలిపారు. హైదరాబాద్ మురికి వాడల్లో 5500 మంది బాలికలకు సహాయం అందిస్తున్నాం. ఈ రన్ ద్వారా 10వేల మంది బాలికలకు సాధికారత కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మురికివాడల మరియు తక్కువ ఆదాయ ప్రాంతాల్లో నివసించే బాలికలను వారి విద్య, ఆరోగ్యం మరియు నైపుణ్య అభివృద్ధికి తమ సంస్థ తోడ్పతుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఇక నుంచి పరిశోధన సులభం.. గంటల్లో చేసే పని నిమిషాల్లోనే.!