తెలంగాణ

telangana

ETV Bharat / state

'రేపు అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన'

ఇవాళ ఆర్టీసీ ఐకాస తలపెట్టిన ఛలో ట్యాంక్ బండ్ సందర్భంగా అరెస్ట్ అయిన ఆ సంఘ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి సాయంత్రం విడుదలయ్యారు. రేపు ఉదయం తమకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.

రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన : అశ్వత్థామ రెడ్డి

By

Published : Nov 9, 2019, 8:38 PM IST

Updated : Nov 9, 2019, 9:33 PM IST

ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ఆర్టీసీ మహిళా కార్మికులతో పాటు మహిళా సంఘాల నేతలు కీలక పాత్ర పోషించారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి తెలిపారు. మహిళా నేతల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించారు. మహిళలపైన జరిగిన దాడికి నిరసనగా రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామన్నారు. ఆర్టీసీ మహిళా కార్మికులు, మహిళా సంఘాల నేతలు చేసిన పోరాటం.. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణీ రుద్రమాదేవీలను తలపించారని ఆయన తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తమకు మద్దతిచ్చిన అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. సోమవారం నుంచి తమ భవిష్యత్​ కార్యాచరణ ఉద్ధృతంగా ఉంటుందని అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు.

రేపు ఉదయం అన్ని డిపోల వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన : అశ్వత్థామ రెడ్డి
Last Updated : Nov 9, 2019, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details