ప్రయాణికుల ఆదరణను చూరగొనడానికి సేవలు మరింత మెరుగుపరచుకోవాల్సి ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఆదాయం పెంచుకునేందుకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు సూచించారు. సంస్థను లాభాల్లోకి తీసుకురావడానికి, ప్రయాణికులకు రవాణా సదుపాయాలు మెరుగుపరిచేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రికి వివరించారు. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో వీలినం, సమ్మె నోటీసుతో పాటు ఇతర సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు మంత్రి వెల్లడించారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించటంతో పాటు ఆర్టీసీ పురోభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు.
ఆర్టీసీ పురోభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి పువ్వాడ - ఆర్టీసీ పురోభివృద్ధికి కృషి
నూతనంగా రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పువ్వాడ అజయ్ కుమార్ తొలిసారిగా టీఎస్ ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో బస్ భవన్‌లో సమవేశమయ్యారు. సంస్థ ఉన్నతాధికారులతో సంస్థాగత విషయాలపై లోతుగా సమీక్షించి పలు అంశాలపై చర్చించారు.
ఆర్టీసీ పురోభివృద్ధికి కృషి చేస్తా: మంత్రి పువ్వాడ
Last Updated : Sep 12, 2019, 7:34 AM IST