ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా బషీర్‌బాగ్‌లో పీడీఎస్‌యూ ఆందోళనకు దిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ హక్కులను కాలరాస్తున్నారని విద్యార్థి సంఘం నేతలు మండిపడ్డారు.
జేబీఎస్ వద్ద 200 మంది అరెస్ట్
సికింద్రాబాద్ జేబీఎస్ వద్ద ఆందోళన చేస్తున్న సీపీఐ నాయకులు, ఆర్టీసీ కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 200 మందిని అరెస్ట్ చేశారు.
మెహదీపట్నంలో ఉద్రిక్తత
మెహదీపట్నం డిపో వద్ద ఆందోళనకు యత్నించిన సుమారు 50 మంది ఆర్టీసీ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ గ్రౌండ్‌కు తరలించారు.
బస్ టైర్లో గాలి తీసేసిన కార్మికులు
సికింద్రాబాద్‌లోని తివోలి జంక్షన్ వద్ద ఆర్టీసీ కార్మికులు బస్‌ను ఆపి టైర్లో గాలి తీశారు. భయపడిన ప్రయాణికులు బస్సు దిగి వెళ్లిపోయారు. కాచిగూడ, బర్కత్ పుర బస్ డిపోల వద్ద బంద్ ప్రశాంతంగా ముగిసింది. కాచిగూడ బస్ డిపో వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన 15 మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్టు చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం బషీర్‌బాగ్ కూడలిలో ఆందోళనకు దిగి... ఆర్టీసీ బస్‌ను అడ్డుకుంది. రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతు
సమ్మెకు ఉద్యోగ సంఘాల మద్దతుహైదరాబాద్ బషీర్‌బాగ్ వ్యవసాయ కమిషనర్ కార్యాలయం ముందు టీఎన్జీవో నగర శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు మధ్యాహ్న విరామ సమయంలో నిరసన చేపట్టారు.
బైక్ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు
హిమాయత్ నగర్లో సీపీఐ నాయకులు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఏఐటీయూసీ భవన్ చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. సమ్మెకు మద్దతుగా ఓయూలోని విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరారు.
బంద్‌కు మద్దతుగా పలుచోట్ల నిరసనలు ఇవీ చూడండి : సీఎల్పీ నేత భట్టి సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్