2 Hours TSRTC Bandh in Telangana State Wide : రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల తీసుకువచ్చిన టీఎస్ఆర్టీసీ బిల్లును రాజ్‌భవన్ పెండింగ్‌లో ఉంచినందున.. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 2 గంటలు బంద్ చేసేందుకు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. గవర్నర్ బిల్లును ఆమోదించాలని ఆర్టీసీ టీఎంయూ నిరసన చేపట్టనున్నారు. శనివారం ఉదయం 10 గంటలకు ఆర్టీసీ కార్మికులు నెక్లెస్ రోడ్డుకు రావాలని యూనియన్ ప్రకటించింది. ఆగస్టు 5న ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్ వద్ద ఆర్టీసీ కార్మికులు తమ నిరసన తెలియజేయనున్నారు. ఈ బిల్లుకు ఇంకా గవర్నర్ వివరణ ఇవ్వలేనందున.. పరిశీలనకు మరికొంత సమయం అవసరమని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
TSRTC Latest News: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్లును రాజ్‌భవన్ పెండింగ్‌లోనే ఉంచింది. బిల్లు పరిశీలనకు మరికొంత సమయం అవసరమని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. ఆర్టీసీ బిల్లుపై న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌భవన్ పేర్కొంది.ఆర్టీసీఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఇంకా అనుమతి ఇవ్వని పక్షంలో రాజ్ భవన్ వివరణ ఇచ్చింది. ఈ మేరకు గవర్నర్ ప్రెస్ కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాలు మూడో తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రెండో తేదీ మధ్యాహ్నం మూడున్నర గంటలకు రాజ్ భవన్‌కు బిల్లు చేరిందని పేర్కొన్నారు. ఆర్టీసీ బిల్లును పరిశీలించి నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం పడుతుందని, న్యాయసలహా తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్ భవన్ స్పష్టం చేసింది.