వాహన పన్ను చెల్లించకుండా అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు వాహనాలపై రవాణ శాఖ కొరడా ఝులిపించింది. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పాపారావు నేతృత్వంలో ఆరు బృందాలుగా ఏర్పడి వాహనాలు తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, బెంగళూరు రూట్లలో శుక్రవారం అర్ధరాత్రి నుండి అక్రమంగా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. రాష్ట్రానికి త్రైమాసిక పన్ను చెల్లించకుండా తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై 60 కేసులు నమోదు చేయడంతో పాటు... 14 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బస్సులకు 50 లక్షల రూపాయల జరిమానా విధించిన్నట్టు రవాణ శాఖ అధికారులు వెల్లడించారు.
నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ కొరడా - VAHANALU
నిబంధనలు పాటించకుండా బస్సులు నడిపితే వదిలిపెట్టేది లేదంటోంది రవాణాశాఖ. అర్థరాత్రి తరువాత జరిపిన దాడుల్లో అక్రమంగా తిరుగుతున్న 60 బస్సులపై కేసులు నమోదు చేశారు. 14 బస్సుల సీజ్‌తో పాటు 50లక్షల జరిమానా విధించారు.
నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ కొరడా