గచ్చిబౌలీలో దొంగల బీభత్సం - Robbery in Gachibowli
హైదరాబాద్ గచ్చిబౌలీలోని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో దొంగలు చోరికి పాల్పడ్డారు. సుమారు 50 తులాల బంగారం ఎత్తుకెళ్లారని బాధితులు వెల్లడించారు.
Robbery in Gachibowli
హైదరాబాద్ గచ్చిబౌలీ టెలీకాం నగర్లో తాళం వేసిన ఇంటిని లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరికి పాల్పడ్డారు. సుమారుగా 50 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారని బాధితులు తెలిపారు. రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయగా... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.