శంషాబాద్ డీసీపీ ప్రకాశ్ రెడ్డి ఆధ్వర్యంలో... 120 మంది పోలీసు సిబ్బంది రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో ఐదుగురు రౌడీ షీటర్లను, 10మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కిరాయికి ఉంటున్న వారి వివరాలు సేకరించాలని ఇంటి యజమానులకు డీసీపీ సూచించారు. ఈ సోదాల్లో రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, సీఐ సురేశ్ పాల్గొన్నారు.
పోలీసు నిర్బంధ తనిఖీలు... అదుపులో అనుమానితులు - corden serach
రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో 120 మంది సిబ్బందితో కార్డెన్సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 ద్విచక్ర వాహనాలను, మూడూ ఆటోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిర్బంధ తనిఖీలు