రైల్వే రిజర్వేషన్ టికెట్లను బ్లాక్లో అమ్ముతున్న వారిపై ఆర్పీఎఫ్ పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. రూ. 14 లక్షల 51 వేల విలువైన టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆర్పీఎఫ్ ముఖ్య రక్షణ విభాగం కమిషనర్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో ఈ సోదాలు చేశారు. ఈ దాడుల్లో అప్పటికప్పుడు ప్రయాణం చేసేందుకు అమ్ముతున్న 206 టికెట్లు, రెండు మూడు రోజుల్లో ప్రయాణం కోసం బుక్ చేసుకున్నవి 840తో కలిపి మొత్తం 1, 046 టికెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించారు. దాదాపు 25 మంది కమీషన్ ఏజెంట్లపై 24 కేసులు నమోదు చేసినట్లు ఈశ్వరరావు తెలిపారు.
బ్లాక్లో రైల్వే టికెట్లు.. వెయ్యికిపైగా స్వాధీనం - రైల్వే పోలీసులు దాడులు
రైలు టికెట్లను బ్లాక్లో అమ్ముతున్న వారిపై రైల్వే పోలీసులు దాడులు చేసి మొత్తం 1,046 టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.14.51 లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
బ్లాక్లో రైల్వే టికెట్లు.. వెయ్యికిపైగా స్వాధీనం
ఇవీ చూడండి : నేడు ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో మరోసారి విచారణ
Last Updated : Oct 29, 2019, 2:44 PM IST