తెలంగాణ

telangana

ETV Bharat / state

నేటితో సమీక్షలు పూర్తి - loksaba

పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అభ్యర్థులను తక్షణమే ప్రకటించి ప్రచారం నిర్వహించేందుకు తగిన సమయం ఇవ్వాలని నియోజకవర్గాల ప్రతినిధులు టీపీసీసీకి విజ్ఞప్తి చేశారు.

సమీక్షలు

By

Published : Feb 17, 2019, 6:08 AM IST

Updated : Feb 17, 2019, 10:12 AM IST

సమీక్షలు
పార్లమెంట్​ ఎన్నికల నోటిఫికేషన్​ విడుదలకు ముందే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సభలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. లోక్​సభ సమీక్ష సమావేశాల్లో రెండో రోజు గ‌చ్చిబౌలిలోని ఓ హోట‌ల్లో ఎనిమిది పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గాల స‌న్నాహ‌క స‌మావేశాలు జ‌రిగాయి. మొదటి రోజు వాయిదా ప‌డ్డ వ‌రంగ‌ల్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గ స‌మావేశంతోపాటు మ‌హ‌బూబ్​న‌గ‌ర్‌, నాగ‌ర్​క‌ర్నూల్‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్‌, న‌ల్గొండ‌, భువ‌నగిరి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష జ‌రిగింది.
టీపీసీసీ కార్య నిర్వాహ‌క అధ్యక్షుడు కుసుమ‌కుమార్ అధ్యక్షత‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో ఉత్తమ్‌తోపాటు ఏఐసీసీ ప్రధాన కార్యద‌ర్శి కుంతియా, భ‌ట్టి విక్ర‌మార్క‌, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రేణుకా చౌదరి తదితరులు హాజరయ్యారు. ఆయా నియోజక వర్గాల నాయ‌కుల నుంచి లోక్​సభ ఎన్నిక‌ల వ్యూహలపై అభిప్రాయాల‌ను సేకరించారు.

దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల‌ని ప్రజలు కోరుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాహుల్​గాంధీని ప్రధానమంత్రి చేయాల‌ని దేశ ప్రజ‌లు ఆకాంక్షిస్తున్నారని తెలిపారు.

నేడు సమీక్షా సమావేశాలకు చివరి రోజు. చేవెళ్ల, మల్కాజ్​గిరి, హైదరాబాద్​, సికింద్రాబాద్ నియోజకవర్గాల సమీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటల నుంచి ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.

Last Updated : Feb 17, 2019, 10:12 AM IST

ABOUT THE AUTHOR

...view details