ఆంధ్రబ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ...హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బ్యాంక్ అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ ఆందోళన చేపట్టింది. 95 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ బ్యాంక్‌ను విలీనం చేయడం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర ఆంధ్రబ్యాంక్ అవార్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ఉపాధ్యక్షుడు అశోక్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తీసుకున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'బ్యాంకుల విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి' - ashok kumar
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆంధ్రబ్యాంక్ విలీనాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంక్ అవార్డు ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసకోండి