తెలంగాణ

telangana

ETV Bharat / state

తహసీల్దార్​ కార్యాలయాలకు ఇక పటిష్ట భద్రత

అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ విజయారెడ్డి హత్య  దేశంలోనే సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ తాహసీల్దార్ కార్యాలయాల భద్రత ఏర్పాట్లను పరిశీలించింది. పలు భద్రతా ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లను సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించింది.

By

Published : Nov 13, 2019, 7:03 PM IST

Updated : Nov 13, 2019, 8:30 PM IST

రెవెన్యూ ఉద్యోగులకు భద్రత ఏర్పాట్లు

తహసీల్దార్​ కార్యాలయాలకు ఇక పటిష్ట భద్రత

విజయారెడ్డి హత్య నేపథ్యంలో రెవెన్యూశాఖ తహసీల్దార్​ కార్యాలయాల వద్ద భద్రతా ఏర్పాట్లపై దృష్టిసారించింది. ఇందుకోసం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల వద్ద పోలీసుల సహకారంతో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు... అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉంచాలని వెల్లడించింది. అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో కలెక్టర్ల వద్ద అందుబాటులో ఉన్న నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.

ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమయం

ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించాలని... ఆ సమయంలో సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలని ఆ శాఖ తెలిపింది. రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ముఖ్యమైన చట్టాలపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి: ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత

Last Updated : Nov 13, 2019, 8:30 PM IST

ABOUT THE AUTHOR

...view details