తెలంగాణ రాష్ట్ర సాధనలో స్వామిగౌడ్, శ్రీనివాస్ గౌడ్‌లు కీలక పాత్ర పోషించారని, దీనిని ఎవరు కాదనలేరని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. రాజకీయంగా తమకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమంలో స్వామిగౌడ్ నాయకత్వంలో తామంతా కలిసి పోరాటం చేశామని వెల్లడించారు. ఇవాళ బోయిన్‌పల్లిలో బహుజన విప్లవవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, గౌడ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
'సామాజిక న్యాయం కోసం ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైంది' - revanth reddy
బడుగు బలహీన వర్గాల బిడ్డ స్వామిగౌడ్‌కు రాష్ట్రంలో గుర్తింపు కరువైందని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ రేవంత్‌రెడ్డి, శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ పాల్గొన్నారు. సామాజిక న్యాయం కోసం తిరిగి ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ అన్నారు.
సమైక్య పాలనలో స్వామిగౌడ్‌పై దాడి చేసిన అధికారులే ఇవాళ కీలక స్థానాల్లో ఉన్నారని రేవంత్ ఆరోపించారు. బడుగు బలహీన వర్గాల బిడ్డ స్వామిగౌడ్‌కు రాష్ట్రంలో గుర్తింపు కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగో తరగతి ఉద్యోగుల ఉద్యమాన్ని స్వామిగౌడ్ ముందుండి నడిపించారని ఈ సందర్భంగా కొనియాడారు. సొంత తెలంగాణ రాష్ట్రంలోనే స్వేచ్ఛ, స్వయం పాలన, సామాజిక న్యాయం కోసం తిరిగి ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందని రేవంత్ అభిప్రాయపడ్డారు.
ఇవీ చూడండి: మిషన్ భగీరథ మంచి ఫలితాలనిచ్చింది: ఎర్రబెల్లి