Revanth Reddy Invite AICC Leaders to Take Oath : రాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం దృష్ట్యా రేవంత్‌రెడ్డి హస్తిన(Delhi)లో వరుస భేటీలు జరుపుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలను వరుసగా ఆయన కలుస్తున్నారు. ఈ క్రమంలో గురువారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానాలు పలుకుతున్నారు. ఈ సందర్భంగా పలువురు ముఖ్య నేతలను రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కలిశారు.
అయితే మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన వెలువడుతున్న సమయంలోనే హైదరాబాద్ నుంచి దిల్లీకి సీఎల్పీ నేత, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు. ఆరోజు ఉదయం నుంచి తీరిక లేకుండా వరుస పర్యటనలు జరిపారు. ముందుగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయిన రేవంత్ రెడ్డి. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిని హైదరాబాద్ రావాల్సిందిగా ఆహ్వానించారు. అక్కడి నుంచి ఖర్గే నివాసానికి వెళ్లి, ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మల్లికార్జున ఖర్గే మంత్రివర్గం ఏర్పాటు, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం.
ఆ లోక్‌సభ స్థానం నుంచి గెలిస్తే - మంత్రి పదవి పక్కా!
Revanth Reddy New Chief Minister in Telangana : ప్రజల తెలంగాణ కోసం నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని ఏఐసీసీ(AICC) అధ్యక్షడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఏఐసీసీ అధ్యక్షుడిని ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. అక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నివాసానికి వెళ్లిన కాబోయే ముఖ్యమంత్రి వారితో సమావేశమయ్యారు.