ప్రజలముందు కేసీఆర్ ముఖం చెల్లకనే... మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ పేరును తెరమీదకు తెస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. హామీలతో ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మున్సిపాలిటీలకు తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ పూర్తిగా విఫలమయ్యారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
'హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తాం'
ఆరేళ్లలో మున్సిపాలిటీలకు తెరాస ప్రభుత్వం చేసిందేమీ లేదని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. పురఎన్నికల్లో కేసీఆర్ ముఖం చెల్లకనే కేటీఆర్‌ను తెరమీదకు తెస్తున్నారని వెల్లడించారు. హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తామని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
'హామీలు నెరవేర్చిన ఒక్క మున్సిపాలిటీ ఉన్నా ఏకగ్రీవం చేస్తాం'