ప్రజలకు ఆగ్రహం వస్తే ప్రగతి భవన్ బద్దలవుతుంది: రేవంత్‌రెడ్డి - revanth reddy on rtc striker
హైకోర్టు సూచలిచ్చినా పట్టించుకోకుండా ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం సకాలంలో ఆర్టీసీకి బకాయిలు చెల్లిస్తే అప్పులు తీసుకునే పరిస్థితి ఉండదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగానే ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించామని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ ఉద్యోగులకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించాలని హైకోర్టు సూచనలిచ్చినా.. ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ప్రభుత్వం 18 రకాల పాసుల ఉచితంగా ఇవ్వడం వల్ల ఏడాదికి రూ.700 కోట్లు ఆర్టీసీకి బకాయి పడిందన్నారు. గత మూడేళ్లకు గాను రూ.2100 కోట్లు చెల్లించాల్సి ఉందని తెలిపారు. వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని.. బకాయిలు చెల్లించాల్సిన డిమాండ్ చేశారు. ప్రజల ఆగ్రహానికి లోనేతే గేట్లు కాదు ఏకంగా ప్రగతిభవనే బద్దలవుతుందని హెచ్చరించారు. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో రేవంత్‌రెడ్డిని పాతబస్తీలోని కామటిపుర పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు సాయంత్రం 7 గంటల సమయంలో విడుదల చేశారు.