అర్హత లేని అధికారులకు ఉన్నత పదవులు కట్టబెట్టడం వల్ల విద్యుత్ సంస్థ దివాళా తీస్తోందని ఎంపీ రేవంత్‌రెడ్డి విమర్శించారు. సమర్థులైన అధికారులను తొలగించి విశ్రాంత ఉద్యోగులను నియమించడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. 74 వేల కోట్ల అప్పుతో విద్యుత్ సంస్థ కుప్పకూలేలా ఉందని చెప్పారు. 35 వేల కోట్ల అప్పు అని ప్రభాకర్‌రావు చెబుతున్న మాటలన్నీ అబద్ధాలేనని ఆరోపించారు. యూనిట్‌కు రూ. 4.74కే రైల్వేకు ఏపీ ఇస్తోందని... తెలంగాణ మాత్రం రూ.7.10కి రైల్వేకి ఇస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ వచ్చాక బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తి 85 నుంచి 69 శాతానికి తగ్గిందని తెలిపారు.
ప్రభుత్వ అసమర్థతతో దివాళా దిశగా విద్యుత్ శాఖ: రేవంత్
ప్రభుత్వ అసమర్థతతోనే విద్యుత్ శాఖ దివాళా తీస్తోందని ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
విద్యుత్ ఉత్పత్తి 85 నుంచి 69 శాతం తగ్గింది: రేవంత్‌రెడ్డి