Revanth Reddy apologized to Venkata Reddy: ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బహిరంగ క్షమాపణ చెబుతున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ నేతల తిట్లకు బాధ్యత వహిస్తూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రేవంత్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి భాష వాడటం ఎవరికీ మంచిది కాదని ఆయన పేర్కొన్నారు. చండూరు సభలో కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ పరుష పదజాలంతో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకొవాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
Revanth Reddy apologized to Venkata Reddy కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిన రేవంత్‌రెడ్డి
10:06 August 13
Revanth Reddy apologized to Venkata Reddy కోమటిరెడ్డి వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పిన రేవంత్‌రెడ్డి
"ఈ మధ్య పత్రికా సమావేశంలో హోంగార్డు ప్రస్తావన, చండూర్ సభలో అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెబుతున్నాను. ఇలాంటి చర్యలు భాష వాడటం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ కోసం క్రియాశీలక పాత్ర పోషించిన వెంకట్‌రెడ్డిని ఇలా అగౌరవపరచడం మంచింది కాదు. తదపరి అద్దంకి దయాకర్ వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీకి చర్యలు తీసుకొవాలని సూచిస్తున్నాను." - రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి:నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రంథాలయాలు.. మౌలిక వసతుల కల్పనకు ఆమడదూరం
కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం