Revanth Reddy and Tummala Meet DK Shivakumar in Bangalore : రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా పొత్తలు, ముఖ్య నాయకుల చేరికల అంశంలో ఒడిఒడిగా అడుగులు వేస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy), మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala) ఇవాళ బెంగళూరు వెళ్లారు. అక్కడ ఉన్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shiva Kumar)తో భేటీ కానున్నారు. దీంతో కొన్ని రోజులుగా తుమ్ముల ఏ పార్టీ వైపు అనే ప్రశ్నకి సమాధానం లభించనుంది. ఆయన దాదాపు కాంగ్రెస్లో చేరిక ఖరారు అయినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ముగ్గురు భేటీ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కీలకం కానున్న డీకే శివకుమార్ : మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) గురువారం చేసిసి కీలక వ్యాఖ్యల విషయంలో చర్చించనున్నారు. దీంతో వైఎస్ఆర్టీపీ పార్టీ విలీనం అంశంలోనూ డీకే శివ కుమార్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.
Revanth Reddy Meet Thummula in Hyderabad : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన ఖమ్మం జిల్లాలో ఆగస్ట్ 26న భారీ వాహన ర్యాలీ చేశారు. ఆ సభలో ఆయన ప్రజల కోసం రాజకీయాలకి దూరంగా ఉండనని.. కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. దీంతో ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అప్పటి నుంచి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేయనున్నారు.. స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తారా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఈ నేపథ్యంలో తుమ్మలను గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. ఏఐసీసీ జిల్లా ముఖ్య నాయకుల అనుమతితోనే తుమ్మలను కలిసినట్లు వివరించారు. సహచరులను, అభిమానులను సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని తుమ్మల తనకు చెప్పినట్లు రేవంత్ రెడ్డి వివరించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టడానికి అందరం ఏకమవుతున్నారని పేర్కొన్నారు.