బీసీ కేటగిరి నుంచి తొలగించిన 26 కులాలను తిరిగి అందులో విలీనం చేస్తానన్న కేటీఆర్ మాటలు ఎక్కడికి పోయాయని ఎద్దేవా చేశారు మాల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రేవంత్‌రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కూకట్‌పల్లిలో రోడ్‌షో నిర్వహించారు. అల్లాపూర్, మోతీనగర్, మూసాపేట్, కేపీహెచ్‌బీ కాలనీల మీదుగా ర్యాలీ సాగింది. తనను గెలిపిస్తే పార్లమెంట్లో పోరాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
గల్లి గల్లీలో రేవంత్‌రెడ్డి ప్రచారం - mp candidate
మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో రోడ్డు షో నిర్వహిస్తూ.. ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
రేవంత్ రెడ్డి రోడ్‌షో