జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులకు బాధ్యతలు అప్పగించారు. జోన్ల వారీగా బాధ్యులను నియమిస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీచేశారు. తూర్పు మండల బాధ్యులుగా షికా గోయల్, పశ్చిమ మండల బాధ్యులుగా అనిల్‌కుమార్ దక్షిణ మండల బాధ్యులుగా డీఎస్ చౌహాన్, మధ్య మండల బాధ్యులుగా తరుణ్ జోషి, ఉత్తర మండల బాధ్యులుగా అవినాశ్ మహంతిని.. సీపీ నియమించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులకు బాధ్యతలు - జీహెచ్ఎంసీ ఎన్నికలు
జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులకు బాధ్యతలనిస్తూ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ల వారీగా బాధ్యులను నియమించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులకు బాధ్యతలు
పోలింగ్, లెక్కింపు కేంద్రాలు, స్ట్రాంగ్ రూంల భద్రతను ఉన్నతాధికారులు తనిఖీ చేస్తారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారు.