Resolution on no Confidence Issues in Telangana :రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మళ్లీఅవిశ్వాసాలుమొదలయ్యాయి. గత పది నెలలుగా స్తబ్దుగా ఉన్న అవిశ్వాసాలు ఎన్నికలు హడావుడి ముగియడంతో మళ్లీ తెలపైకి వచ్చినట్లయింది. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్ పురపాలక సంఘం, మంచిర్యాల పురపాల సంఘం ఛైర్మన్లపై ఆయా మున్సిపాలిటీల కౌన్సిలర్లు అధికారులకు అవిస్వాల తీర్మానాల నోటీసులు జారీ చేశారు. వీటితో కలిపి ఇప్పటి వరకు 34 పురపాలికల్లో ఛైర్మన్లపై అవిశ్వాసాలు తెలిపైకి వచ్చినట్లు తెలుస్తోంది.
Pratidwani: మున్సిపాలిటీలు... అవిశ్వాసాల అలజడి
రాష్ట్రంలోని పురపాలక సంఘాల పాలకవర్గాలు అధికారంలోకి వచ్చి ఈ ఏడాది జనవరి 27వ తేదీతో మూడేళ్లు అయింది. ఆ మరుసటి రోజునుంచే అసమ్మతి గళాలు మొదలయ్యాయి. ఛైర్మన్లపై అవిశ్వాసాలు ప్రతిపాదిస్తూ పలు మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు నోటీసులు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లును గత ప్రభుత్వం అసెంబ్లీ ఆమోదించినా, గవర్నర్ ఆమోదం పొందకపోవడం వల్ల సవరణ బిల్లుకి చట్టబద్ధత రాలేదు.
No Confidence Bill With Governor in Telangana : ఈలోగా కౌన్సిలర్లు అవిశ్వాసాలు ప్రవేశ పెట్టడంతో కొందరు ఛైర్మన్లు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి నిబంధనలు రూపొందించాలని ఇదే సమయంలో అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఇప్పట్లో అసెంబ్లీ రావడంతో అధికారులు దాన్ని పక్కన పెట్టారు.