బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలని ఆయన అన్నారు. సేవాభావంతో ఎన్టీఆర్ క్యాన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని తెలిపారు.
'సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలి'
స్వాతంత్య్ర సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలని నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
'సమరయోధుల స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి పాటుపడాలి'
తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోందని బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఆస్పత్రిలోనూ కొవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. 3,200 మంది చిన్నారులకు ఉచితంగా గ్రహణం మొర్రి చికిత్స చేయించామన్నారు.
ఇదీ చదవండి: ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీకయే.. స్వదేశీ టీకా : గవర్నర్