తెలంగాణ

telangana

ETV Bharat / state

పాతబస్తీలో మాతం ఊరేగింపు - ఊరేగింపు

హైదరాబాద్​ పాతబస్తీలో మొహర్రం సందర్భంగా మాతం ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ ఊరేగింపులో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొని తమ శరీరాలను రక్తం చిందేలా గాయ పర్చుకుంటారు.

పాతబస్తీలో మాతం ఊరేగింపు

By

Published : Sep 10, 2019, 4:16 PM IST

హైదరాబాద్ పాతబస్తీలో మొహర్రం వేడుకలలో భాగంగా మాతం ఊరేగింపును నిర్వహించారు. మాతంలో షీయా ముస్లీంలు పెద్ద సంఖ్యలో పాల్గొని సంతాప గేయాలు అలపిస్తూ తమ శరీరాలను కత్తులు, బ్లేడులతో గాయపర్చకుంటూ రక్తం చిందించారు. డబీర్​పురాలోని బీబీ కా అలవాను అంబారీలో ఊరేగింపుగా తీసుకువచ్చారు. అలవా ఊరేగింపు డబీర్‌ పురా, చార్మినార్‌, మీర్‌చౌక్ మీదుగా చాదర్‌ఘాట్‌ వరకు కొనసాగింది. ఈ ఉరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

పాతబస్తీలో మాతం ఊరేగింపు

ABOUT THE AUTHOR

...view details