సికింద్రాబాద్లోని పీజీ కళాశాలలో ఎంకామ్, ఎమ్మెస్డబ్ల్యూ విద్యార్థులకు హాస్టల్ వసతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మెరిట్ ఆధారంగా హాస్టల్ వసతి ఉంటుందన్న ఉద్దేశంతో దూర ప్రాంతాల విద్యార్థులు కళాశాలలో చేరుతున్నారని సికింద్రాబాద్ ఏబీవీపీ అధ్యక్షుడు జీవన్ పేర్కొన్నారు. విద్యార్థుల పట్ల ప్రిన్సిపల్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తొలగించిన హాస్టల్ వసతులను వెంటనే పునరుద్ధరించాలని...లేదంటే కార్యక్రమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
హాస్టల్ వసతిని పునరుద్ధరించాలని... రిలే నిరాహార దీక్ష - ఎంకామ్, ఎమ్మెస్డబ్ల్యూ
సికింద్రాబాద్లోని పీజీ కళాశాలలో హాస్టల్ వసతిని పునరుద్ధరించాలని కోరుతూ ఏబీవీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
హాస్టల్ వసతిని పునరుద్ధరించాలంటూ రిలే నిరాహార దీక్ష