హైదరాబాద్ ప్రైవేటు ఆసుపత్రులు దోపిడికి పాల్పడుతున్నాయని మృతుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు బిల్లుల పేరుతో పీడిస్తున్నాయని మృతుల బంధువులు ఆరోపించారు. తాజాగా మోతీనగర్‌లోని సన్‌రిడ్జ్ ఆసుపత్రిలో కరోనా సోకి ఓ రోగి చనిపోవడంతో 15 లక్షలు బిల్లు చెల్లిస్తేనే మృతదేహం ఇస్తామని యాజమాన్యం మొండికేయడం వల్ల మృతుని బంధువులు ఆందోళన చేపట్టారు.
ఆసుపత్రి యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాచారం తెలుసుకున్న సనత్‌నగర్ పోలీసులు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. బీహెచ్ఈఎల్కు చెందిన 42 ఏళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తికి కరోనా సోకడంతో... గత వారం క్రితం మోతి నగర్‌లోని సన్‌రిడ్జ్ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రిలో చేరే ముందు రూ.3 లక్షలు చెల్లించి చికిత్స పొందాడు.