ఈనెల 8న భారత వైమానిక దినోత్సవ 87వ వార్షికోత్సం సందర్భంగా దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో రిహార్సల్స్ నిర్వహించారు. వైమానిక దళానికి ఎంపికైన అభ్యర్థులకు ఇచ్చే శిక్షణ, అత్యవసర సమయాల్లో స్పందించాల్సిన తీరుపై అధికారులు వివరించారు. వాయుసేనలో పనిచేసేందుకు కఠోర శిక్షణ అవసరమన్నారు. సాంకేతక పరిజ్ఞానంపై అవగాహన, ఫైరింగ్, స్విమ్మింగ్, పెరేడ్ వంటి అంశాల అవగాహన కలిగి ఉండాలన్నారు. పైలెట్‌కు ఉండాల్సిన అర్హతలు వివరించారు. ఫ్లైయింగ్, గ్రౌండ్ డ్యూటీ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సంబంధించిన అభ్యర్థులంతా ఈ అకాడమీలోనే శిక్షణ పొందుతారు.
దుండిగల్ వాయుసేన అకాడమీలో రిహార్సల్స్ - dundigal air force academy
ఈనెల 8న భారత వైమానిక దినోత్సవ 87వ వార్షికోత్సం సందర్భంగా దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో రిహార్సల్స్ నిర్వహించారు.
దుండిగల్ వాయుసేన అకాడమీలో రిహార్సల్స్
ఇవీచూడండి: చొరబాటు మార్గాల గుర్తింపు- భద్రత పెంపు
Last Updated : Oct 2, 2019, 9:53 AM IST
TAGGED:
dundigal air force academy