ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలు, విద్యార్థుల ఆత్మహత్యలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కలిస్తే... హామీ ఇచ్చారు తప్పితే అమలు చేయలేదని తెతెదేపా సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. తప్పులు చేసిన గ్లోబరీనా సంస్థపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాల్లో జరిగిన పొరపాట్లకు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి అధికారం నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తే... మరింత రెచ్చిపోయే ధోరణిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. సర్కారు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ.. అన్ని పార్టీలు కలిసి మే 11న నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
'ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది' - CHANDRA SHEKER REDDY
ఎన్ని తప్పులు జరిగినా... ప్రజలు తీర్పిచ్చి మమ్మల్ని గెలిపించారని చెప్పుకుంటూ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు. దేని గురించి ప్రశ్నించినా మీకెన్ని సీట్లు వచ్చాయంటూ ఎద్దేవా చేస్తున్నారు: రావుల చంద్రశేఖర్ రెడ్డి, తెతెదేపా నేత
'ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది'