తెలంగాణ

telangana

ETV Bharat / state

వైరల్: గ్రేటర్ పోరులో 'రావాలి జగన్- కావాలి జగన్'

'రావాలి జగన్.. కావాలి జగన్' ఏపీ ఎన్నికల్లో ఒక ఊపు ఊపిన నినాదం. ఈ పదాలు వింటే చాలు ఏపీ సీఎం జగన్ గుర్తు రావటం ఖాయమే. ఇప్పుడు ఇదే నినాదం గ్రేటర్ పోరులోనూ తెరపైకి వచ్చింది. అదేంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వైకాపా పోటీ చేయటం లేదు కదా... ఈ నినాదం వినిపించడమేంటి అనుకుంటే పొరపాటే...! ఇందుకో లెక్క ఉంది!

వైరల్: గ్రేటర్ పోరులో 'రావాలి జగన్- కావాలి జగన్'
వైరల్: గ్రేటర్ పోరులో 'రావాలి జగన్- కావాలి జగన్'

By

Published : Nov 21, 2020, 7:14 PM IST

రాష్ట్రంలో జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోరు రోజురోజుకూ వేడెక్కుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా... ఓ ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. కారణం... 'రావాలి జగన్- కావాలి జగన్' అనే నినాదమే! తెరాస తరఫున పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ప్రచారం రథంపై ఈ నినాదం దర్శనమిస్తోంది. ఇది చూసిన చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

గ్రేటర్ పోరులో 'రావాలి జగన్- కావాలి జగన్'

ప్రచారం రథం మార్చలేదా? ఏపీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులు ఎవరో వాడిన ఎన్నికల ప్రచార వాహనాన్ని హడావుడిగా తీసుకొచ్చి దానికి గులాబీ రంగు వేసి వాడుకుంటున్నారేమో అంటూ నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. మరికొందరేమో స్టిక్కర్‌ను తొలగించడం మర్చిపోయారేమో అంటూ కామెంట్స్​ చేస్తున్నారు.

ఎందుకు రాశారంటే..

వైకాపా- తెరాస కలిసి పోటీ చేస్తున్నాయా? తెరాసకు వైకాపా మద్దతు ప్రకటించిందా? అంటూ రకరకాలుగా స్పందిస్తున్నారు. వాహనంపై అలా ఎందుకు రాశారని మీకూ డౌట్ వస్తోందా? అసలు విషయానికొస్తే... జీహెచ్ఎంసీ పరిధిలోని జగద్గిరిగుట్ట నుంచి కొలుకుల జగన్ అనే వ్యక్తి తెరాస అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పేరు కూడా జగన్ కాబట్టి, తన ఎన్నికల ప్రచార రథంపై '‘రావాలి జగన్.. కావాలి జగన్'’ అని రాయించారు. ఇంకేముంది ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇదీ చూడండి:'ఇది అమాయకపు అహ్మదాబాద్ కాదు హుషార్ హైదరాబాద్'

ABOUT THE AUTHOR

...view details