తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆగని ఆకృత్యం... యువతిపై కీచకపర్వం! - శ్రీకాకుళంలో యువతిపై హత్యాచారం

తినటానికి బయటకు వెళ్లిన యువతిపై కీచకులు అసభ్యంగా ప్రవర్తించారు. రక్షించండని అరచినందుకు విచక్షణ మరచి కొట్టారు.

rape-attempted-on-a-young-girl-at-srikakulam-district
తాగి యువతిని చుట్టుముట్టారు... అసభ్యంగా ప్రవర్తించారు..

By

Published : Dec 2, 2019, 3:09 PM IST

తాగి యువతిని చుట్టుముట్టారు... అసభ్యంగా ప్రవర్తించారు..

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిపై అసభ్యంగా ప్రవర్తించారు కొందరు కీచకులు. ఇంజినీరింగ్ కాలేజీ సమీపంలో​ బాధితురాలు ఇద్దరు స్నేహితులతో కలసి రూమ్​లో అద్దెకు ఉంటుంది. ఆదివారం రాత్రి 8.30 గంటల సమయంలో టిఫిన్ చేయడానికి బయటకు బయలుదేరింది. ఆమె రాకను గమనించిన ఓ వ్యక్తి... చేయి పట్టుకున్నాడు. నిందితుడితోపాటు అతడి ముగ్గురు స్నేహితులు... అమ్మాయిపై దాడికి పాల్పడ్డారు. విచక్షణారహితంగా కొట్టారు. బాధను భరించలేని బాధితురాలు కాపాడండి.. అంటూ కేకలు వేయగా... స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details