'కోళ్ల పెంపకం రైతుల సమస్యలు పరిష్కరిస్తా' - mp
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిని పౌల్ట్రీ రైతుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటల కోళ్ల పెంపకం రైతులను ఆదుకుంటామని హామీనిచ్చారు.
హైదరాబాద్ నగర శివారు శంషాబాద్‌లో చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి రాష్ట్ర పౌల్ట్రీ రైతుల సంఘం ఆధ్వర్యంలోఆత్మీయ సన్మానంఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలో కోళ్ల పెంపకం రైతులను ఆదుకుంటామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, రాష్ట్ర పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులతో కలిసి రంజిత్‌రెడ్డిని ఘనంగా సన్మానించారు. కోళ్ల పెంపకంలో చిన్నకారు రైతులు నష్టాల భారీన పడుతున్నారని.. వాటి నుంచి తప్పించేందుకు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలను తీర్చుతానని రంజిత్‌రెడ్డి ప్రకటించారు.