ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించే కార్వాన్ దర్బార్ మైసమ్మ బోనాలు ఈ ఏడాది కరోనా కారణంగా నిరాడంబరంగా నిర్వహించారు. ప్రజలు గుమిగూడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించిన మరునాడు నిర్వహించే రంగం కార్యక్రమం నిరాడంబరంగా నిర్వహించారు. భవిష్యవాణిలో.. తనని త్రికరణ శుద్ధిగా పూజించి.. ఐదు వారాల పాటు సాక పెట్టాలని అమ్మవారు కోరారు. త్వరలో కరోనా నుంచి తనను నమ్ముకున్న భక్తులకు విముక్తి కలుగుతుందని భవిష్యవాణిలో చెప్పారు.
నిరాడంబరంగా కార్వాన్ మైసమ్మ దేవాలయం వద్ద భవిష్యవాణి - తెలంగాణ బోనాలు
ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కార్వాన్‌లోని దర్బార్ మైసమ్మ దేవాలయం వద్ద రంగం కార్యక్రమం నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించిన మరునాడు నిర్వహించే రంగం కార్యక్రమానికి భక్తులెవరినీ అనుమతించలేదు.
నిరాడంబరంగా కార్వాన్ మైసమ్మ దేవాలయం వద్ద భవిష్యవాణి