హైదరాబాద్ ముషీరాబాద్ భోలక్‌పూర్, రాంనగర్, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో ముస్లిం సోదరులు రంజాన్ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. దర్గాలు, ఈద్గాల వద్ద తెల్లవారుజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముస్లిం సోదరులు పరస్పరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. శాసనసభ్యులు గోపాల్ ఇతర తెరాస నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ముఠా గోపాల్ తెలిపారు.
ముషీరాబాద్‌లో వైభవంగా రంజాన్ వేడుకలు - ముషీరాబాద్‌లో వైభవంగా రంజాన్ వేడుకలు
రంజాన్ పండుగను పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గంలోని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. వేకువ జాము నుంచే ప్రార్థనలతో ఈద్గాలు, దర్గాలు కళకళలాడాయి.
ముషీరాబాద్‌లో వైభవంగా రంజాన్ వేడుకలు