Rajendranagar Murder Case Update : రాజేంద్రనగర్లోదారుణహత్యకుగురైన రాహుల్ కేసులో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడలో ఉన్న సెలబ్రిటీ జిమ్ నుంచి బయటకు వస్తున్న రాహుల్(Rahul)ను ముగ్గురు దుండగులు రెక్కీ నిర్వహించి హత్య చేసిన ఘటన తెలిసిందే. నిందితుల కోసం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రియుడి మోజులో భర్తను చంపిన భార్య.. గొడ్డలితో ఐదు ముక్కలుగా నరికి..
రాహుల్‌కు సమీప బంధువుల అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగినట్లు సమాచారం. కాగా ఇటీవల వేరే యువతితో రాహుల్‌కు పెళ్లి నిశ్చయం కావడంతో హత్యకు దారితీసి ఉంటుందా అన్నకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను చేసుకున్నా.. తనను కూడా వివాహం చేసుకోవాలని రాహుల్‌ను అతని బంధువుల యువతి కోరగా.. ఈ విషయాన్ని సెటిల్ చేసేందుకు అజహర్ అనే మధ్యవర్తికి రాహుల్ రూ.4 లక్షలు ఇచ్చినట్లుగా సమాచారం. సెటిల్మెంట్లో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అజహర్‌ను డబ్బులు వెనక్కి ఇవ్వాలని రాహుల్ కోరాడని అతని బంధువులు చెబుతున్నారు.
Couple Murder Kamareddy : భర్తను కొట్టి.. భార్యకు ఉరేసి.. దారుణ హత్య.. దోపిడీ దొంగల పనేనా?
ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి జిమ్ వద్ద పెప్పర్ స్ప్రే(PAPPER SPRY) కొట్టి రాహుల్‌ను హత్య చేసి నిందితులు పరారయ్యారు. ఇద్దరు వ్యక్తులు హత్య చేయగా.. మరో వ్యక్తి ద్విచక్ర వాహనంపై బయట నిల్చుని ఉన్నట్లు సీసీటీవీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి కాగా.. అనంతరం వారి బంధువులకు అప్పగించారు. పోలీసులు వారి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. రాహుల్ సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.