నిజామాబాద్ లోక్‌సభ పరిధిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈవో రజత్‌కుమార్ తెలిపారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు మాక్ పోలింగ్ జరుపుతామన్నారు. ఎన్నికల ఏర్పాట్లపై రైతు అభ్యర్థులు సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. కర్షకుల అనుమానాలు పూర్తి స్థాయిలో నివృత్తి చేశామని తెలిపారు. నిజామాబాద్‌కు ఒక హెలికాప్టర్‌తో పాటు.. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక హెలిప్యాడ్ ఏర్పాటు చేశామని వివరించారు. ఎన్నికల విధులకు ఎవరు ఆటంకం కలిగించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
నిజామాబాద్‌లో పోలింగ్ 8 గంటల నుంచి ప్రారంభం - నిజామాబాద్‌లో పోలింగ్ 8 గంటల నుంచి ప్రారంభం: రజత్‌కుమార్
రాష్ట్రంలో అందరి చూపు నిజామాబాద్ నియోజకవర్గంవైపే... అక్కడ లోక్‌సభ స్థానానికి 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనికోసం ప్రత్యేకఏర్పాట్లు చేశారు ఎన్నికల సంఘం అధికారులు.
నిజామాబాద్‌లో పోలింగ్ 8 గంటల నుంచి ప్రారంభం