తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆంధ్రాలో మూడు రాజధానులపై జనాగ్రహం... - cm jagan on amaravathi

ఆంధ్రప్రదేశ్​కు మూడు రాజధానులన్న సీఎం వ్యాఖ్యలపై ప్రస్తుత రాజధాని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా అమరావతిని అభివృద్ధి చేయాలని... రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల అన్నదాతలు రోడ్డెక్కారు.  పలు రకాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేశారు.

rajadhani-farmers-protest-in-amaravathi
rajadhani-farmers-protest-in-amaravathi

By

Published : Dec 20, 2019, 10:32 AM IST

Updated : Dec 20, 2019, 12:19 PM IST

ఆంధ్రప్రదేశ్​కు అమరావతి, విశాఖపట్నం, కర్నూలు లలో రాజధానులను ఏర్పాటు చేయోచ్చన్న ఏపీ​ సీఎం జగన్​మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై ప్రస్తుత రాజధాని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాసన, న్యాయ, కార్యనిర్వాహక పనుల కోసం 3 ప్రాంతాలను రాజధానులుగా చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై వారు ఉద్యమ బాటపట్టారు. గత ప్రభుత్వం ప్రతిపాదించినట్లుగా అమరావతిని అభివృద్ధి చేయాలని... రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల అన్నదాతలు రోడ్డెక్కారు.

ఆందోళన చేస్తున్న అమరావతి రైతులు

పలు రకాలుగా ఆందోళనలు

బంద్​ ద్వారా తమ నిరసన వ్యక్తం చేసిన రైతులు... ఆందోళన ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. రాజధాని రైతుల ఐక్య కార్యాచరణ కమిటీ భవిష్యత్ ప్రణాళికను ప్రకటించింది. తుళ్లూరులో వంటావార్పు, మందడంలో మహాధర్నా, వెలగపూడిలో నిరాహారదీక్షలు కొనసాగించాలని నిర్ణయించింది. వైకాపా ప్రభుత్వం... 3 రాజధానుల ప్రతిపాదన విరమించుకునే వరకూ వెనక్కి తగ్గేదేలేదని అమరావతి ప్రాంత రైతులు తేల్చి చెప్తున్నారు.

అసైన్డ్​ భూములపై ప్రభుత్వ ఆరోపణలు అర్థం లేనివి

రాజధానిలో అసైన్డ్‌ భూముల విక్రయాలపై... ప్రభుత్వం చేస్తున్న ఆరోపణల్లో అర్థం లేదని కొందరు రైతులు అభిప్రాయపడుతున్నారు. అన్నదాతల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని సూచిస్తున్నారు. అమరావతిలోనే పరిపాలనా రాజధాని కొనసాగించాలనే నినాదాన్ని... రాజధాని పరిధిలోని గ్రామగ్రామానికీ తీసుకెళ్లేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.

ఇవీ చూడండి : 'నిరసనలపై విపక్షాలు పెట్రోల్​ చల్లుతున్నాయి'

Last Updated : Dec 20, 2019, 12:19 PM IST

ABOUT THE AUTHOR

...view details