గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. గోమాతను కాపాడాలని చేసిన నినాదం కేంద్ర ప్రభుత్వానికి వినిపించాలన్నారు. తను ప్రథమంగా హిందువునని.. గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
'పార్టీ నుంచి ఒత్తిడి చేస్తే రాజీనామా చేస్తానని చెప్పా' - ఎమ్మెల్యే రాజా సింగ్ వార్తలు
గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమేనని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో యుగతులసి పౌండేషన్ చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు.
గోమాత కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధం: రాజాసింగ్
గోవుల సంరక్షణ, హిందూ ధర్మం కోసం చేసే పోరాట సమయంలో పార్టీ నుంచి అనేక ఒత్తిళ్లు వచ్చాయని ఆ సమయంలో తాను పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేసినట్లు వివరించారు. గోమాత రక్షణ అంశాలకు ఎవరు అడ్డు వచ్చినా ఎదురిస్తానని చెప్పారు.
ఇదీ చదవండి:యాసంగిపై మంత్రి సమీక్ష.. సాగుపై సుధీర్ఘ చర్చ