రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
ఇవాళ సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, నారాయణ పేట జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ చత్తీస్‌గడ్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు తెలంగాణ, రాయలసీమ మీదగా 3.1 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని వెల్లడించింది.
తూర్పు బిహార్ దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని.. దీనికి అనుబంధంగా 3.1కిలో మీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. ఇది రేపు బలహీనపడే అవకాశం ఉందని ప్రకటించింది. ఎల్లుండి ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఇదీ చూడండిపరువు హత్య హేమంత్ అంత్యక్రియలకు ఏర్పాట్లు