గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. కాప్రా, సైనిక్‌పురి, ఈసీఐఎల్, జీడిమెట్ల, సురారం, కొంపల్లి, సుచిత్రలో మోస్తరు వర్షం పడింది. అంబర్‌పేట, తిరుమలనగర్ రహదారిపై చెట్టు విరిగిపడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పాడింది. వర్షపు నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ సిబ్బంది రహదారులపై నీరు నిలువకుండా చర్యలు చేపడుతున్నారు.
కాలనీలోకి నీరు