తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (Rains in Telangana) కురిసే అవకాశం ఉందని(Telangana Weather Updates) హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ప్రకటించింది. గురువారం ఉత్తర ఝార్ఖండ్, పరిసర బిహార్ ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం... నేడు బలహీన పడింది. అల్పపీడనంగా మారి తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిపోయిందని తెలిపింది.
తూర్పు గాలులలోని ద్రోణి ఈరోజు ఆగ్నేయ బంగళాఖాతం మధ్య భాగాల్లో ఉన్న ఆవర్తనం నుంచి తమిళనాడు తీరం వరకు సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కి.మీ ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని పేర్కొంది. అక్టోబర్ 6వ తేదీ నుంచి వాయువ్య భారతదేశంలోని కొన్ని భాగాల నుంచి నైరుతి రుతుపవనములు తిరోగమించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ(Hyderabad Meteorological Center) వెల్లడించింది.