తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైల్వేలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే వ్యూహమే కనిపిస్తోంది'

బడ్జెట్​లో రైల్వేశాఖలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే వ్యూహమే కనిపిస్తోందని కార్మిక సంఘం నేతలు అభిప్రాయపడ్డారు. ఖాళీల భర్తీపై ఎటువంటి ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Railway Unions comments On Railway Budget 2021
'ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే వ్యూహమే కనిపిస్తోంది'

By

Published : Feb 2, 2021, 5:32 AM IST

బడ్జెట్​లో భారతీయ రైల్వేకు రూ.1,10,055 కోట్లు కేటాయించినట్లు కార్మిక సంఘాలు తెలిపారు. రైల్వేకు సంబంధించి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే వ్యూహమే కనిపిస్తోందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

ఖాళీల భర్తీపై బడ్జెట్​లో ఎటువంటి ప్రస్తావన లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానంగా దక్షిణ మధ్య రైల్వే జోన్​ పరిధిలో 15 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అందులో 12 వేల పోస్టులు భద్రతా విభాగంలోనే ఉన్నాయని కార్మిక నేతలు తెలిపారు. బల్లార్షా-ఖాజీపేట్-విజయవాడ-గూడూరుకు మూడో లైన్​ వేయడం సంతోషకరమన్నారు. ట్రాక్​లను మరమ్మతులు చేసి సామర్థ్యం పెంచితే.. రైళ్ల వేగం పెంచవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

ఇవీచూడండి:రైల్వేకు బూస్ట్​- రూ.1.10 లక్షల కోట్లు కేటాయింపు

ABOUT THE AUTHOR

...view details