రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో విడతకు పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. రేడియో జాకీ చైతూ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించిన ఆర్జే కాజల్... హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్కులో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తానూ ఓ భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేశారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించిన ఆర్జే కాజల్ - rj kajal plantation
రేడియో జాకీ చైతూ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆర్జే కాజల్... హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ పార్కులో మొక్క నాటారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలు గాయని లిప్సిక, బిగ్ బాస్- 2 ఫేం అలీరైజా, సుష్మ కిరణ్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.
radio jakee kajal accepted green India challenge
భారతదేశాన్ని కాలుష్యం లేని పచ్చని దేశంగా మార్చటంలో ప్రతీ ఒక్కరు భాగస్వామ్యులు కావాలని సూచించారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలని కోరారు. ఈ సందర్భంగా తన స్నేహితురాలు గాయని లిప్సిక, బిగ్ బాస్- 2 ఫేం అలీరైజా, సుష్మ కిరణ్‌లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిశ్‌ర్ గౌడ్ పాల్గొన్నారు.