Traffic Police Special Drive in Rachakonda: రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహన్ ఆదేశాల మేరకు బండి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎల్బీనగర్లోని రాచకొండ కమిషనరేట్ క్యాంప్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. నెంబర్ ప్లేట్స్ లేని వాహనాలు, నెంబర్లను టాంపరింగ్ చేసిన వాహనాలను గుర్తించి మోటర్ వెహికల్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నామని ఆయన హెచ్చరించారు.
రాచకొండ కమిషన్రేట్ పరిధిలోని 8 ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల్లో రెండు షిప్టులు వారిగా 233 మంది పోలీస్ సిబ్బందితో 17 చోట్ల స్పెషల్ డ్రైవ్ జరుగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు 149 కేసులు నమోదు చేయగా 815 వాహనాలకు చలనాలు విధించామని పేర్కొన్నారు. చలనాలు నుంచి తప్పించుకోవడం కోసం.. నెంబర్లు కనపడకుండా కొందరు మాస్క్ పెట్టడం జరుగుతుందని.. ఇలాంటి వాహనాలను గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Motor Vehicle Acts: చైన్ స్నాచర్, రాత్రి పూట దొంగతనాలు చేసే వారు డూప్లికేట్ నెంబర్లు వాడుతున్నారని... వాటిని తగ్గించడం కోసమే స్పెషల్ డ్రైవ్ చేపట్టడం జరిగిందని డీసీపీ పేర్కొన్నారు. ఇంట్లో నుంచి బయటికి వచ్చేటప్పుడు వాహనాల నెంబర్ ప్లేట్స్ సరిగ్గా ఉందో లేదో సరి చూసుకోవాల్సిన బాధ్యత వాహనదారులకు ఉందని సూచించారు. డ్రైవ్లో దొరికిన వాహనాలకు 420 సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని డీసీపీ వివరించారు.
"చాలా మంది దొంగలు, చైన్ స్నాచర్స్ నెంబర్ లేని బైక్లు ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. వాటిని అరికట్టడమే ప్రధాన ఉద్దేశ్యంగా ఈరోజు స్పెషల్ డ్రైవ్స్ చేపట్టడం జరిగింది. మొత్తం రాచకొండ పరిధిలో 17 చోట్ల ఈ డ్రైవ్ చేపట్టాం. 815 వాహనాలకు చలనాలు విధించాం. 149 మందిపై కేసులు నమోదు చేశాం. వాహనదారులు కూడా మీ నెంబర్ ప్లేట్లు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొండి. లేకుంటే మోటర్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తాం".-డి. శ్రీనివాస్, ట్రాఫిక్ డీసీపీ రాచకొండ
మీ బైక్పై నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదా..! అయితే కోర్ట్ మెట్లు ఎక్కాల్సిందే ఇవీ చదవండి: