ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక ఫైరింగ్ సాధన కార్యక్రమంలో రాచకొండ పోలీసులు పాల్గొన్నారు. సీపీ స్థాయి అధికారుల నుంచి కానిస్టేబుల్ సిబ్బంది వరకూ... తెలంగాణ పోలీసు అకాడమీలోని ఫైరింగ్ రేంజ్ సాధన చేశారు. ఏకే 47, ఎం5, గ్లాక్ పిస్తోల్‌తో ప్రాక్టిస్ చేశారు.
'తుపాకీ ఇలా పట్టాలి.. ఫైరింగ్ అలా చేయాలి'
యానువల్ ఫైరింగ్ సాధన కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది పాల్గొని ఫైరింగ్ రేంజ్‌ను సాధన చేశారు. అకాడమీ చేసిన ఏర్పాట్లపై సీపీ హర్షం వ్యక్తం చేశారు.
ఫైరింగ్ సాధనలో రాచకొండ పోలీసులు
ఈ సాధనలో సీపీ మహేశ్ భగవత్ కూడా పాల్గొన్నారు. ఎల్బీ నగర్, భువనగిరి క్రైమ్ డీసీపీలు, పలువురు సిబ్బంది హాజరయ్యారు. సాధన చేసేందుకు వీలుగా అకాడమీ చేసిన ఏర్పాట్లపై... డైరెక్టర్‌కు సీపీ కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చూడండి:చిన్నారికి అరుదైన వ్యాధి.. సాయం కోసం క్రౌడ్ ఫండింగ్